ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఇద్దరు ఏపీ ఐపీఎస్‌ లపై చర్యలు తీసుకోండి.. ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2023, 05:55 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై కస్టోడియల్‌ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనను హింసించిన వారిలో ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నారని వివరించారు. పీవీ సునీల్‌ కుమార్‌, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు హింసించారని తెలిపారు. సీబీఐ లేదా ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని ప్రధానికి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. తనపై జరిగిన దాడిపై సీబీఐ, ఎన్‌ఐఏల దర్యాప్తుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ కమిటీ ద్వారా కూడా తనపై జరిగిన దాడి పట్ల విచారణ జరిపించాలని కోరుతూ ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ సీఐడీ గతంలో రఘురామను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. అక్కడి నుంచి ఏపీకి తరలించారు.. అక్కడ పోలీసు కస్టడీలో తనను హింసించినట్లు గతంలోనే ఎంపీ ఆరోపించారు. తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి రఘురామ లేఖ రాశారు. అంతేకాదు ఎంపీ రఘురామ పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తన కుమారుడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అంశాన్ని కూడా ఈ లేఖలో రఘురామ ప్రస్తావించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com