ఏపీలో 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిన మంచిని వివరించడానికిగాను వైయస్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర సాగుతోంది. యాత్ర ఐదో రోజు అనకాపల్లి జిల్లా మాడుగుల, కృష్ణా జిల్లా అవనిగడ్డ, చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గాల్లో జరుగుతుంది. మాడుగులలో మంత్రి బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. యాత్రలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాధ్, రాజన్నదొర పాల్గొనన్నారు. మధ్యాహ్నాం 12:15కు కే.కోటపాడులో మీడియా సమావేశంలో మంత్రులు పాల్గొనున్నారు. అనంతరం బైకు ర్యాలీ ప్రారంభం కానుంది. సాయంత్రం 3 గంటలకు మాడుగులలో బహిరంగ సభ నిర్వహించున్నారు. చిత్తూరులో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. బస్సుయాత్రలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2:45కి విలేకర్ల సమావేశంలో నేతలు పాల్గొనున్నారు. అనంతరం సూర్య ప్రతాప కళ్యాణ మండపం నుంచి బైక్, ఆటో ర్యాలీ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు నాగయ్య కళాక్షేత్రం వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3:30కి ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 4 గంటలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను పార్టీ నేతలు ప్రారంభించనున్నారు. అనంతరం బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు జరిగే బహిరంగ సభలో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్ తదితరులు పాల్గొనున్నారు.