ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోందని, వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో సాగునీటి రంగం, వ్యవసాయ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం వైయస్ జగన్ తెలిపారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్రమంత్రి షెకావత్‌తో కలిసి సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. ఈ సదస్సులో సుమారు 90 దేశాల నుంచి ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు.