ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పింది చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, గార మండలం వాడాడ పంచాయతీలో మంత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళు అవుతోంది. మీరంతా ఓటు వేసి మమ్మల్ని గెలిపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వాన ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఎన్నికల ముందు చెప్పినవి అన్నీ అమలు చేశాం. ఇవాళ మీ అభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. రైతులకు పెద్ద ఎత్తున వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంది. చిన్న,చిన్న కమతాలు కలిగిన రైతులను ఆదుకున్నాం. అలానే ప్రతి ఏటా రైతు భరోసా పేరుతో రూ.13,500 పెట్టుబడి సహాయం అందించాం. ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు తీసుకు వచ్చాం. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పోటీ పరీక్షలకు తగ్గట్టుగా పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేశాం. కేవలం చదువు ఒక్కటే సామాజిక ఎదుగుదలకు కారణం అవుతుంది అని నమ్మి,అందుకు తగ్గ విధంగా ప్రోత్సాహం అందించాం అని తెలిపారు.