రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఆరోగ్యవంతమైన జీవనం గడపాలనే లక్ష్యంతో సీఎం జగన్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని నిజం చేస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 37, 51, 42, 44వ డివిజన్లలోని 4 సచివాలయలలో పరిధిలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. వైద్యం చేయించుకున్నా ప్రజలకు మందులు పంపిణీ చేసి వైద్య పరీక్షలు ఏ రకంగా చేస్తున్నారో పర్యవేక్షించారు. అనంతరం 37వ డివిజన్ పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.