విజయనగరం జిల్లా, కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. వారికి నష్ట పరిహారం చెక్కులను మంత్రి అందజేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కుదుట పడే వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని సూచించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన 13 మందికి, 30 మంది గాయపడిన వారికి కలసి మొత్తం 43 మందికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.59 కోట్లు పరిహారంగా అందజేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. మంగళవారం 8 మందికి పరిహారం అందించామని, ఈ రోజు 12 మందికి పరిహారం అందజేశామని, రేపటిలోగా అందరికీ పరిహారం అందిస్తామని మంత్రి వెల్లడించారు.