రైలు 13 గంటలు ఆలస్యంగా నడిపి.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని దక్షణ మధ్య రైల్వేకు కేరళలోని ఎర్నాకుళం వినియోగదారుల కోర్టు రూ.60 వేల జరిమానా విధించింది. ఫిర్యాదుదారుడు తన ప్రయాణ ఉద్దేశాన్ని ముందుగా తెలపలేదని, అందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకోలేదని రైల్వే శాఖ ఆరోపించింది. రైలే శాఖ వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. చెన్నై డివిజన్‌లోని అర్కోణం వద్ద రైల్వే యార్డు పునర్‌నిర్మాణ పనుల వల్లే ఆలస్యమైందని గుర్తించింది.