ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టించే వార్తను అమెరికా చెప్పింది. న్యూక్లియర్ వెపన్స్ను పెంచుకుంటూ పోతున్న అమెరికా.. అతిపెద్ద అణుబాంబును తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్లోని హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 24 రెట్లు శక్తివంతమైన న్యూక్లియర్ బాంబును తయారు చేస్తోంది. ఇప్పటికే అమెరికా వద్ద 5,550కిపైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి.