పైలట్లు, విమాన సిబ్బందికి సంబందించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త నిబంధనలను తెచ్చింది. దీనిలో బాగంగా పైలట్లు, విమాన సిబ్బంది ఇక నుంచి మౌత్‌వాష్, టూత్ జెల్‌లను వాడకూడదని పేర్కొంది. వాటిలో ఆల్కహాల్ శాతం ఉండటమే కారణమని పేర్కొంది. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లు చేసినపుడు పాజిటివ్ ఫలితాలొస్తున్నాయని వెల్లడించింది. వీటితోపాటు సీఏఆర్‌లో మరికొన్ని నిబంధనలను మారుస్తూ డీజీసీఏ ప్రకటన విడుదల చేసింది.