అల్లూరి ఏజెన్సీలో సంపూర్ణమైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడంలేదు. వైద్య సదుపాయం కోసం అరకులోయ పరిసర ప్రాంతాల ప్రజలు డోలీ మోతలు కొనసాగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లాలంటే గిరిజనులు డోలీలను ఆశ్రయిస్తున్నారు. ఇరగాయి పంచాయతీ, జరిమానగూడకు చెందిన స్వాతికి పురిటినొప్పులు రావడంతో వైద్యం కోసం ఆమె బంధువులు డోలీ పట్టారు. 7 కి.మీ. దూరంలో ఉన్న వైద్య కేంద్రానికి ఆమెను మోసుకువెళ్లారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీ మోత చేపనట్టినట్లు స్వాతి బంధువులు తెలిపారు. ఇప్పటికైనా తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని జరిమానగూడ గ్రామస్తులు కోరుతున్నారు. అందుకోసం అధికారులు చర్యలు తీసుకోవలని వారు డిమాండ్ చేస్తున్నారు.