శ్రీ సద్గురు సంగీత సభ 30వ వార్షిక సంగీత మహోత్సవాలు ఈ నెల 4నుంచి 11వరకు విజయవాడ, దుర్గాపురంలోని శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో జరగనున్నట్టు కళాశాల కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రసిద్ధ సంగీత విద్వాంసుల కచేరీలతో పాటు ఏటా ఇస్తున్నట్టు ఈ ఏడాది కూడా సంగీతం, నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్న యువతకు నగదు పురస్కారాలు, పేద కళాకారులకు ఆర్థిక చేయూత అందజేస్తామన్నారు. అలాగే సద్గురు సంగీత విద్వన్మణి బిరుదు ఈ ఏడాది విఖ్యాత మృదంగ విదుషీమణి, పద్మశ్రీ దండమూడి సుమతీ రామ మోహనరావుకు అందించనున్నట్టు తెలిపారు. అలాగే నాట్యాచార్య చింతా రవి బాలకృష్ణ శిష్య బృందం చే భక్త ప్రహ్లాద కూచిపూడి యక్షగానం ప్రదర్శింపబడుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa