తమిళనాడులోని తూత్తుకుడిలో పరువు హత్యలు కలకలం రేపాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట దారుణ హత్యకు గురైంది. మూడు రోజుల క్రితం మారిసెల్వం (24), కార్తీక (20) ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే యువతి బంధువులు ప్రేమ జంటను కత్తులతో దాడి చేసి హత్య చేశారు. యువకుడి ఒంటిపై 20 కత్తి పోట్లు, యువతి ఒంటిపై 12 కత్తి పోట్లను పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి యువతి కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు.