కర్ణాటకకు చెందిన ఓ వృద్ధురాలు ఆమె జీవనోపాధికి ఆసరాగా ఉన్న రెండెకరాల భూమిని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చి, అదే బడిలో వంట మనిషిగా పనిచేస్తోంది. ఆమె దాతృత్వాన్ని, సేవను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. హుచ్చమ్మ అనే ఆ వృద్ధురాలని ప్రభుత్వమే స్వయంగా ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ పురస్కార గ్రహీతకు రూ.లక్ష నగదు బహుమతి, 25 గ్రాముల బంగారం అందిస్తారు.