ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అణగారిన వర్గాలకి అండగా నిలిచింది జగనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2023, 11:18 AM

రాష్ట్ర మంత్రివర్గంలో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే అందించిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని వైసీపీ నేతలు కొనియాడారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చిన జగనన్నకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. దేశంలో సామాజిక న్యాయాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్నేనని పేర్కొన్నారు. గురువారం సామాజిక సాధికార బస్సు యాత్ర 5వ రోజు కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగింది. బడుగు, బలహీన వర్గాలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com