జబ్బులు ఉన్నాయని కోర్టుకు చంద్రబాబు అబద్దాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నాడని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ... వంద మందో, రెండు వందల మందో చంద్రబాబుకు ర్యాలీకి రాకుండా ఎలా ఉంటారు?!.. వంద వాహనాలు పెడితే రోడ్డు జామ్ కాకుండా ఎలా ఉంటుంది?.. మా ఎమ్మెల్యే వెళితే కూడా అంతకంటే ఎక్కువ మంది వస్తారు అని ఆయన పేర్కొన్నారు. రోగం వచ్చింది, వెంటనే హాస్పిటల్ కు వెళ్ళకపోతే పోతాను అన్నట్లు చెప్పింది చంద్రబాబు.. రోగం వచ్చిందని చెప్పాడు కనుకే 14 గంటలు కారులో ఎలా కూర్చున్నాడని సజ్జల ప్రశ్నించారు. జబ్బులు ఉన్నాయని కోర్టుకు అబద్దాలు చెప్పాడు చంద్రబాబు అని ప్రశ్నించారు. ఆ అబద్దాలతోనే బెయిల్ తెచ్చుకున్నాడు.. ఒక నేరానికి పాల్పడి లోపలికి వెళ్ళాడన్నారు.