జగన్ సీఎం అయ్యాక అనేక సంస్కరణలు చేపట్టారని వైసీపీ నేత మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేసారు. సీఎం అయిన తర్వాత తొలుత అందరూ జగన్ కు అవగాహన లేదని విమర్శలు చేసారన్నారు. ఇప్పుడిప్పుడే ఆ సంస్కరణల ఫలితమేమిటో తెలిసి వస్తోందని వివరించారు. జగన్ అమలు చేస్తున్న పథకాల అవసరాన్ని గమనించి చంద్రబాబు కూడా అమలు చేస్తానంటున్నారని అన్నారు. మేము ఇస్తున్నవన్నీ చంద్రబాబు ఇస్తానంటున్నాడు.. అవన్నీ ఇప్పుడే జగన్ పాలనలో పొందుతున్న వారు చంద్రబాబుకు ఎందుకు ఓటు వేస్తారు అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా అని నిలదీసారు.