తమిళనాడు మంత్రి ఈవీ వేలు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. శుక్రవారం చెన్నై, తిరువళ్లూరు, తిరువన్నమళై, తిరుచ్చి, కరూర్ సహా 40కి పైగా ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మంత్రి వేలుకు చెందిన అరుణై మెడికల్ కాలేజీ, అరుణై ఇంజినీరింగ్ కాలేజీ, హోటళ్లు, వ్యాపార కార్యాలయాల్లో అధికారులు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధించి ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.