మహారాష్ట్రలోని పుణె జిల్లా ఎరవాడ జైలులోని కొందరు ఖైదీలు గత ఆగస్టులో 'శృంఖల ఉపహార్ గృహ్' పేరుతో హోటల్ ని ప్రారంభించారు. జైలు అధికారి అమితాబ్ గుప్తా చొరవతో ప్రారంభించారు. 24 మంది ఖైదీలతో నడుస్తున్న ఈ హోటల్లో ఆహారం బాగుండటంతో వచ్చేవారు క్రమంగా పెరిగారు. ‘‘జైల్లో ఉన్న ఖైదీల్లో మంచిగా వంట చేసే వాళ్లు ఉన్నారని తెలుసుకుని, వారిని ప్రోత్సహించేందుకు టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించాం’’ అని జైలు అధికారులు తెలిపారు.