స్కిల్ డెవలప్ మెంట్ కేసు అంశాలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొంది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరించింది.