చంద్రబాబు మధ్యంతర బెయిల్లో అదనపు షరతుల అంశంపై హైకోర్టు తీర్పునిచ్చింది. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని, రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని కోర్టు తెలిపింది.