కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కలమసేరి పేలుళ్లకు సంబంధించి కేరళ పోలీసులు రెండోవ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో మతపరమైన రెచ్చగొట్టే పోస్టులు చేశారనే అభియోగాలతో ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు కేంద్ర మంత్రిపై గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో బిజెపి జాతీయ కార్యదర్శి అనిల్ కె ఆంటోని పేరును కూడా చేర్చారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా సెల్ కన్వీనర్ సరిన్ పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.