భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య, రక్షణ పరమైన పరస్పర సహకారాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన దేశమని, ఈ రెండు దేశాల మధ్య బంధం ఈ శతాబ్దపు ‘మోస్ట్ డిఫైనింగ్ రిలేషన్‌షిప్’ అని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ అభివర్ణించారు. న్యూ ఢిల్లీలో గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ నిర్వహించిన 'ది ఎనర్జీ ట్రాన్సిషన్ డైలాగ్స్'లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.