రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపైన కేసులు కడుతూ, రాష్ట్రంలో నిరంకుశ పాలన నడిపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం మండిపడ్డారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంపై తాము లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. మిగిలిన పొత్తులు సాధారణంగా ఎన్నికలు రెండు నెలలు ముందు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.