ఏపీలోని రిషికొండ నిర్మాణాలపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. సీఎం జగన్ ను రిషికొండకు వెళ్లవద్దని అంటున్నారు.. ఇందులో ప్రజాప్రయోజనం ఏముందని సీజేఐ ప్రశ్నించింది. ఈ కేసులో రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికే హైకోర్టులో, NGTలో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది.