స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి కనీసం ఏభై పైసల అవినీతి అయినా ప్రభుత్వం చూపించగలిగిందా అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... చంద్రబాబుపై కేసు పెట్టి అరెస్టు చేయడానికి అనేక అబద్ధాలను వండి వార్చడం తప్ప ఒక్క చిన్న ఆధారాన్ని కూడా ప్రభుత్వంగానీ, సీఐడీ గానీ చూపించలేకపోయాయన్నారు. చంద్రబాబు... టీడీపీ నేతలు... వారి సన్నిహితుల్లో ఒక్కరికి కూడా ఒక్క రూపాయి అయినా అందినట్లు నిరూపించలేకపోయారని ఆయన తెలిపారు.