ప్రపంచకప్లో టిమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గాయంతో ఇప్పటికే కొన్ని మ్యాచ్లకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్ మ్యాచ్లో గాయపడ్డ హార్దిక్ న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకపై ఆడలేదు. అయితే తాజాగా గాయం తీవ్రత పెరగడంతో ఈ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఐసీసీ ప్రకటించింది. హార్దిక్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణను జట్టులోకి తీసుకుంది.