సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరగడంతో పాటు తమిళుల పెరటాసి మాసం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. దీంతో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. సెప్టెంబర్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు కాగా, అక్టోబర్లో హుండీ ఆదాయం రూ.108.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా గత నెలలో 1.05 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు పేర్కొంది.