ఏపీ సర్కారుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. తీవ్ర కరవు పరిస్థితుల గురించి చర్చించని మంత్రి వర్గం ఈ రాష్ట్రానికి అవసరమా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని 400కుపైగా మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉంటే కేవలం 103 కరవు మండలాలను ప్రకటిస్తారా? అని నిలదీశారు. గ్రామాలను ఖాళీ చేసి ప్రజలు వలస వెళ్తుంటే సీఎం జగన్, మంత్రులకు కనిపించట్లేదా?' అంటూ దుయ్యబట్టారు.