ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజా మాన్ సింగ్ ప్యాలెస్‌కు మార్పులు చేసి తాజ్ మహల్‌ను సిద్ధం చేశారంటూ పిల్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు ఈ విషయంపై భారత పురావస్తు శాఖ దృష్టిసారించాలని ఆదేశించింది. తాజ్ మహల్‌కు చెందిన చరిత్ర పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దాలంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.