ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం ఎంతో మంది సామాన్య పౌరుల ప్రాణాలు బలి తీసుకుంటోందని ఐక్య రాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-గాజా ఘర్షణలపై తాజాగా బ్రిటన్ ప్రధాన రిషి సునాక్ శుక్రవారం రోజున నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాల్సిన ఆవశ్యకతను ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. పశ్చిమాసియాలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రపంచ కప్ క్రికెట్లో భారత టీమ్ సాధిస్తున్న విజయాలను రిషి సునాక్ అభినందిస్తూ మోదీకి కంగ్రాట్స్ తెలిపారని చెప్పారు.