రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరలు తగ్గే వరకు ప్రభుత్వం సబ్సిడీపై శనివారం నుంచి విక్రయించనున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత తెలిపారు. నెల్లూరులోని ఫతేఖాన్ పేట, నవాబుపేట రైతు బజార్లలో కిలో రూ. 40 చొప్పున ఒకరికి రెండు కిలోలు విక్రయించనున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ విక్రయాలు జరుపుతామని తెలిపారు.