మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మోకాలికి సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ సమయంలో తాను గాయపడినట్లు ఇన్స్టాలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎంఎంఏ ఫైట్ కోసం తాను శిక్షణ తీసుకుంటున్నానని, ఈ క్రమంలో గాయపడినట్లు తెలిపారు. గాయం నుండి కోలుకున్న తర్వాత ఫైట్ చేసేందుకు మళ్లీ శిక్షణ ప్రారంభిస్తానని ఆయన తెలిపారు.