ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత ముదిరే ప్రమాదం ఉందని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇటీవల ప్రకటించారు. ఈ యుద్దానికి అమెరికానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘గాజా యుద్ధం, అందులోని ప్రజల మరణాలకు అమెరికా పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఒక సాధనం మాత్రమేనని, ఈ యుద్ధం ప్రాంతీయ యుద్ధంగా మారకుండా ఉండాలంటే తక్షణమే యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. మధ్యధరా సముద్రంలోని మీ యుద్ధనౌకలు మమ్మల్ని భయపెట్టలేవు' అని ఆయన స్పష్టం చేశారు.