విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ. రవిశంకర్ శుక్రవారం నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాఫిక్ ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. స్పీడ్ , రాంగ్ పార్కింగ్, ర్యాష్, నెగ్లజెన్స్ డ్రైవింగ్ చేసే వారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ప్రమాదాలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి పట్ల కట్టుదిట్టంగా ఉండాలని తెలిపారు.