సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఎందుకు కొనసాగాలని అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం పార్టీ శ్రేణులతో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ వై. వి. సుబ్బా రెడ్డి శుక్రవారం విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో నేతలతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు పాల్గొన్నారు.