తమ తల్లిదండ్రులను, ఇంట్లో ఉండే వృద్ధులను ఎవరైనా నిర్లక్ష్యం చేసినా, శారీరకంగా లేదా మానసికంగా ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని సీపీ డాక్టర్ ఎ.రవిశంకర్ అయ్యనార్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందనతోపాటు డయల్ యువర్ సీపీ’ కార్యక్రమాల్లో పిల్లలు తమను పట్టించుకోవడం లేదని, ఇబ్బందిపెడుతున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.