విశాఖజిల్లా పెందుర్తి నియోజకవర్గం వేపగుంట జీవీఎంసీ జోన్ 8 కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇటీవల కాలంలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో ఎక్కువ అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. స్పందనలో ఫిర్యాదులు చేయడంతో ఏసీబీ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఏసీబీ దాడులు జరుగుతాయని ముందుగానే కొంతమంది ఉద్యోగులకు తెలియడంతో విధులకు గైర్హాజరయ్యారు.