ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల విశాఖలో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం రాత్రి జర్నలిస్టులు సంబరాలు జరిపారు. కేక్ కట్ చేసి పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. విశాఖ అక్రిడిడేట్డ్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ గౌరవాధ్యక్షుడు రాఘవేంద్ర రెడ్డి, సొసైటీ అధ్యక్షులు బి. రవికాంత్, జర్నిలిస్టులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa