శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి శనివారంసమావేశం నిర్వహించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ వర్షాలు లేక రాగి మొక్కజొన్న వేరుసెనగ పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. రైతులను వైసిపి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయనకోరారు. క్షేత్రస్థాయి పంట పొలాలను పరిశీలించేందుకు ఈనెల6తేదీ సోమవారం టిడిపి ప్రతినిధులు బృందం మడకశిరకు వస్తున్నట్లు తెలిపారు.