విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి శనివారం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, ఆరోగ్యం మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమం, ప్రభుత్వ పథకాలు, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫోరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి తదితరులు పాల్గొన్నారు.