ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరవుతో ప్రజలు వలసబాట పడుతున్నది కనిపించడం లేదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 04, 2023, 03:04 PM

రాష్ట్రంలో  కరవు తాండవిస్తున్నా.. కేబినెట్ భేటీలో కనీస చర్చ లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్ సమయాన్నంతా వెచ్చిస్తున్నారన్నారు. దోచుకోవడం, చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదుకే జగన్ రెడ్డి తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారన్నారు. కరవు మండలాల ప్రకటనలోనూ రైతులను జగన్ రెడ్డి మోసం చేశారన్నారు. లక్షలాది ఎకరాల్లో కళ్లముందే పంటలు ఎండిపోతున్నా కనీసం కేబినెట్ భేటీలో చర్చలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం పట్ల జగన్ రెడ్డి ఉదాసీన వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు కరవుతో ప్రజలు వలసబాట పడుతున్నది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీరు అందక పడుతున్న అవస్థలపై కేబినెట్‌లో చర్చించే తీరిక కూడా లేదా? అని నిలదీశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com