నెల్లూరు జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. మనస్తాపం చెంది అయ్యప్ప మాలాధారణలో ఉన్న వినయ్ అనే యువకుడు బుచ్చిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకి న్యాయం జరగకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆత్మకూరులో వినయ్, వంశీలపై రౌడీ మూకలు విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి సమయంలో అక్కడే ఉండి కూడా పోలీసులు సహకరించకుండా, రౌడీలకు మద్దతుగా నిలుస్తూ.. బాధితులని పోలీస్ స్టేషన్కి తరలించి వేధింపులకు పాల్పడ్డ్డారని ఆవేదన చెందారు. నిందితులు షబ్బీర్, మున్నా, మోనాఫ్, ఫరూఖ్ పై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములుఆందోళన చేస్తున్నారు.