ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం గ్రామ సమీపంలో ఉన్న చెరువు ప్రమాదకరంగా మారిందని గ్రామ ప్రజలు అంటున్నారు. ఇటీవల కాలంలో చెరువులో మట్టి కోసం తవ్వకాలు జరిగాయని ఆ తవ్వకాల కారణంగా పెద్ద పెద్ద గుంతలు పడంతో ఆ గుంతలోకి శుక్రవారం కురిసిన వర్షానికి నీరు చేరింది. దీనితో పిల్లలు అలా వెళ్తే ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉందని శనివారం తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామప్రజలు కోరుతున్నారు.