హైదరాబాద్ ఫార్మా కంపెనీ లీ ఫార్మా తన బయోకార్టిలేజ్ స్మూత్‌వాక్ టాబ్లెట్లను యూఏఈ మార్కెట్లోకి విడుదల చేసింది. న్యూట్రాస్యూటికల్స్ విభాగంలో ఒక భారత ఉత్పత్తికి యూఏఈ ఆమోదం తెలపడం ఇదే ప్రథమం. యూఏఈ నుంచి ఇటీవల మార్కెటింగ్ ఆథరైజేషన్‌ను పొందినట్లు కంపెనీ డైరెక్టర్ ఆల్ల లీలారాణి తెలిపారు. మోకాలి సర్జరీ ప్రివెన్షన్ థెరపీలో దీన్ని వినియోగిస్తారని.. దీన్ని మధ్య ప్రాచ్య, తూర్పు ఆసియా దేశాల్లో ప్రవేశపెట్టడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో అమెరికాలో కూడా అనుమతికి దరఖాస్తు చేసుకోనున్నామని చెప్పారు.