రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు నిరుద్యోగులను నిరాశపరిచాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీవాసరావు విమర్శించారు. మెగా డీఎస్సీపై నిర్ణయం తీసుకోకపోవడంతో నిరుద్యోగుల ఆశల పై నీళ్లు చల్లినట్లయిందన్నారు. రాష్ట్రంలో 18 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ ఏడాది 12వేల మంది టీచర్లు రిటైరవుతారని తెలిపారు. ఖాళీగా ఉన్న ఈ టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, గిరిజన యువతకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీనే నెరవేర్చకపోవడం శోచనీయమని ఆయన విమర్శించారు.