వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై సమీక్షించకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. కరవుపై చర్చించని మంత్రివర్గ సమావేశమెందుకు? అని ప్రశ్నించారు. 400 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కర్నూలు జిల్లాలో కరవు కారణంగా ఊళ్లు ఖాళీ అవుతున్నాయని పేర్కొన్నారు.