అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గ్రామాలకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అద్దంకి నియోజకవర్గ అధ్యక్షులు మంద జోసెఫ్ పాల్గొని ఇంటింటికి తిరిగి సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.