రాజస్థాన్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సందీప్ దాయ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురుద్వారాలను కూల్చివేయాలంటూ ఆరోపించారు. తిజారాలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. తిజారాలో ఎక్కడ పడితే అక్కడ గురుద్వారాలు కట్టారన్నారు. ఇవి మన భవిష్యత్‌కు నష్టదాయకంగా మారుతాయని, వాటిని కూల్చివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.