ప్రతి పేద మహిళలకు రెండు ఎకరాల భూమిని కేటాయించాలని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకుడు కత్తి పద్మారావు డిమాండ్ చేశారు. పొన్నూరు పట్టణంలోని లుంబిని వనంలో శనివారం నవ్యాంధ్ర పార్టీ సమావేశం నిర్వహించారు సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. విశాఖ, కర్నూలు, ఒంగోలులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని రాజమండ్రిలో సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పార్టీ నాయకులు పాల్గొన్నారు.