ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురందేశ్వరి అని ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ లో స్పందిస్తూ.. 'బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ టీడీపీ అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం. తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి కేంద్రమంత్రి పదవులు అనుభవించిన నీతి లేని చరిత్ర అమెది. అవమానవీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ లో ఉండి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ ఆమె' అని పేర్కొన్నారు.